రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

Showing posts with label సంగతులు. Show all posts
Showing posts with label సంగతులు. Show all posts

Hindu Festivals & Calendar in 2011


Hindu Festivals 2011 based on Hindu traditional calendar - India Standard Time. This is a list of important festival dates in Hinduism in 2011 based on various regional Hindu calendars. The same festival might be celebrated a day earlier or later in different parts of India. The calendar is incomplete as there is confusion regarding few Hindu festivals in 2011.
January 2011
Makar Sankranti – 14th January, 2011 - (15th January in western and eastern parts of India)
Pongal – 15th January, 2011
Thai Pusam – January 20, 2011
February 2011
Vasant Panchami – Saraswati Puja – February 8, 2011
March 2011
Shivratri – 3rd March, 2011
Holi – March 20th, 2011
April 2011
Ugadi (New Year in Karnataka and Andhra Pradesh) – April 4th, 2011
Gudi Padva – April 4th, 2011
Chaitra Navratri Begins - April 4th, 2011
Ram Navami – 12th April, 2011
Chithirai 1 (Tamil New Year) – 14th April, 2011
Hanuman Jayanti – 18th April, 2011
Vishu (Kerala) – 14th April, 2011
New Year in Bengal and Assam – 15th April, 2011
May 2011
Akshaya Tritiya – 6th May, 2011
Narasimha Jayanti – 16th May, 2011
June 2011
Puri Rath Yatra – 3 July, 2011
July 2011
Vyas Purnima, Guru Purnima – 15th July, 2011
August 2011
Raksha Bandan – 13th August, 2011
Sri Krishna Janmashtami – 22nd August, 2011
September 2011
Ganesh Chaturthi - 1st September, 2011
Onam - September 9, 2011
Pitru Paksha Shradh - 13th September, 2011 to 27th September
Navratri Begins – 28th September, 2011
October 2011
Durga Ashtami – 4th October, 2011
Maha Navami – 5th October, 2011
Vijaya Dashami – Dussehra – 6th October, 2011
Karva Chouth – October 13, 2011
Deepavali – Diwali – 26th October, 2011
Gujarati New Year - 27th October, 2011
November 2011
Karti Purnima - November 10
Sabarimala Mandala Kalam begins – 16th November, 2011
December 2011
Sri Dattatreya Jayanti - December 10

Tips for Better Life


1. Take a 10-30 minutes walk every day. And while you walk, smile.
2. Sit in silence for at least 10 minutes each day.
3. Sleep for 7 hours.
4. Live with the 3 E's -- Energy, Enthusiasm, and Empathy.
5. Play more games.
6. Read more books than you did in 2007.
7. Make time to practice meditation, yoga, and prayer. They provide us with daily fuel for our busy lives.
8. Spend time with people over the age of 70 & under the age of 6.
9. Dream more while you are awake.
10. Eat more foods that grow on trees and plants and eat less food that is manufactured in plants.
11. Drink plenty of water.
12. Try to make at least three people smile each day.
13. Don't waste your precious energy on gossip.
14. Forget issues of the past. Don't remind your partner with his/her mistakes of the past. That will ruin your present happiness.
15. Don't have negative thoughts or things you cannot control. Instead invest your energy in the positive present moment.
16. Realize that life is a school and you are here to learn. Problems are simply part of the curriculum that appear and fade away like algebra class but the lessons you learn will last a lifetime.
17. Eat breakfast like a king, lunch like a prince and dinner like a beggar.
18. Smile and laugh more.
19. Life is too short to waste time hating anyone. Don't hate others.
20. Don't take yourself so seriously. No one else does.
21. You don't have to win every argument. Agree to disagree.
22. Make peace with your past so it won't spoil the present.
23. Don't compare your life to others'. You have no idea what their journey is all about. Don't compare your partner with others.
24. No one is in charge of your happiness except you.
25. Forgive everyone for everything.
26.. What other people think of you is none of your business.
27. However good or bad a situation is, it will change.
28. Your job won't take care of you when you are sick. Your friends will. Stay in touch.
29. Get rid of anything that isn't useful, beautiful or joyful.
30. Envy is a waste of time. You already have all you need.
31. The best is yet to come.
32. No matter how you feel, get up, dress up and show up.
33. Do the right thing!
34. Call your family often.
35. Your inner most is always happy. So be happy.
36. Each day give something good to others.
37. Don't over do. Keep your limits.

ఆంధ్రుల అమృతాంజనం


ఒకప్పుడు ‘ముక్కోటి ఆంధ్రుల'మని కాలరెగరేసి చెప్పుకునేవాళ్లం. ఆ మాటల్లో ‘మేం ముక్కోటి దేవుళ్లకు సరిసమానమండోయ్‌!' అన్న అతిశయమూ వినిపించేది. అయినా ఆ దేవుళ్లు, తెలుగువాళ్లకంటే ఎందులో గొప్ప! ఇన్నేళ్లలో దేవతల జనాభా పెరిగిన దాఖలాల్లేవు. మరి మనమో, పదికోట్లు దాటిపోయాం. వాళ్లు అమృతం సృష్టిస్తే, మనం అంతకంటే రెండక్షరాలు ఎక్కువున్న అమృతాంజనం సృష్టించాం. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి హృదయసాగర మథనంలోంచి పుట్టిందా దివ్యాంజనం. దేవుళ్లు తమ్ముళ్లను నొప్పించి అమృతం లాగేసుకుంటే, మనం తోటివాళ్ల నొప్పులు తగ్గించడానికి అమృతాంజనాన్ని దేశమంతా విస్తరించాం. ఇప్పుడది ఖండాంతరాలకు పాకిపోయింది. యూరప్‌ దాకా వెళ్లింది. అమెరికాలోనూ దొరుకుతోంది. మధ్యప్రాచ్యంలో బోలెడంత గిరాకీ ఉందట.
అటూఇటుగా అమెరికాలో ‘విక్స్‌ వెపొరబ్‌' పుట్టినప్పుడే ఆంధ్రదేశంలో అమృతాంజనం పుట్టింది. 1893లో ప్రాంతంలో పంతులుగారు బొంబాయి కేంద్రంగా వ్యాపారం ప్రారంభించారు. కొద్దిరోజుల్లోనే ఉత్తరదక్షిణాలన్న తేడాలేనంతగా గిరాకీ పెరిగింది. నాగేశ్వరరావు పంతులుగారు అమృతాంజనం వ్యాపారంలో లక్షలు గడించారు. కానీ నయాపైసా దాచుకోలేదు. ఉన్నదంతా దేశం కోసమే ఖర్చుచేశారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన ‘ఆంధ్రపత్రిక' ఆ డబ్బుతోనే నడిచింది. తొలిరోజుల్లో బ్రిటిష్‌
వ్యతిరేక సభల్లో, హర్తాళ్లలో అమృతాంజనం సీసాలు ఉచితంగా పంచేవారట. అలా...తలనొప్పినే కాదు, తెల్లవాళ్లనూ తరిమేసింది తెలుగువారి అమృతాంజనం.

మహాప్రసాదం!


ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి పదవీగండం ఉందని ప్రచారం జరిగింది. దీంతో ఆ ఖాకీబాసు తిరుపతి లడ్డూలు పట్టుకుని ఓ కీలకనేత దర్శనానికెళ్లారు. అనుకున్నట్టే, రెండ్రోజుల్లో దొరగారి పదవి వూడింది. కానీ, బొత్తిగా పన్లేని సీట్లో కూర్చోబెట్టకుండా, కాస్త గౌరవప్రదమైన బాధ్యతే కట్టబెట్టారు. తిరుపతి లడ్డూ రాయబారం పనిచేసిందన్నమాట!
తిరుపతి లడ్డూలు చేతిలో ఉంటే తిరుగే ఉండదు. సీఎం పేషీకెళ్లినా ప్రైమ్‌మినిస్టర్‌ ఆఫీసుకెళ్లినా పనులు చకచకా జరిగిపోతాయి. ఇక అమెరికాకెళ్తే, సాక్షాత్తు శ్రీవేంకటేశుడే వచ్చినంత సంబరపడిపోతారు ప్రవాస సోదరులు. అంత కమ్మగా ఉంటాయి కాబట్టే శ్రీనివాసుడు ఏరికోరి వండించుకుంటున్నాడో, శ్రీనివాసుడికి నివేదించడంవల్లే ఆ కమ్మదనం వచ్చిందో తెలియదు కానీ...లడ్డూలంటే తిరుపతి లడ్డూలే! ఆ రుచి నాలుకని తాకగానే అప్రయత్నంగా కళ్లుమూసుకుంటాం. అది భక్తి కావచ్చు, తీపంటే అనురక్తీ కావచ్చు. ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే తిరుపతి లడ్డూ!

1940 ప్రాంతంలో కల్యాణోత్సవాలు మొదలైనప్పుడే...లడ్డూ ప్రసాదం పుట్టింది. తిరుపతి లడ్డూ తయారీకి కచ్చితమైన పద్ధతంటూ ఉంది. ఏయే దినుసుల్ని ఎంతెంత పరిమాణంలో వాడాలో తెలియజేసే ‘దిట్టం' ఉంది. కాలానికితగినట్టు దానికీ మార్పులు చేస్తున్నారు. తొలిరోజుల్లో కట్టెల పొయ్యిమీద ప్రసాదం తయారు చేసేవారు. మెల్లగా యంత్రాలు ప్రవేశించాయి. రుచిలోనూ నాణ్యతలోనూ ఎంతోకొంత తేడా వచ్చింది. అయినా, తిరుపతి లడ్డూలకు తిరుగులేదు. పేటెంటు పుణ్యమాని ఆ విశిష్టత రికార్డులకెక్కింది.

ఆవకాయ


ఆపదల నాదుకొను కూర ఆవకాయ
అతివ నడుమైన జాడిᄃెు ఆవకాయ
ఆంధ్రమాత సిందూరమ్మె ఆవకాయ
ఆంధ్రదేశమ్మె తానొక్క ఆవకాయ
ఎంత గొప్పగా చెప్పారండీ గరికిపాటివారు!

మామిడికాయ వూరగాయ ఎవరైనా పెట్టుకోగలరు. అదేం బ్రహ్మవిద్య కాదు. నాలుగు కాయలు కోసేసి ఉప్పూకారం కలిపితే చచ్చినట్టు పచ్చడైపోతుంది. ఆంధ్రులు తప్ప, ఎవరైనా ఆపనే చేస్తారు. కానీ తెలుగిళ్లలో ఆవకాయ పెట్టడమంటే ఏ సత్యనారాయణస్వామి వ్రతమో చేసినంత భక్తీశ్రద్ధా. చిన్నరసాలు పట్టుకోడానికి పెద్దప్రయత్నమే చేయాలి. చిన్నావాల కోసం సూపర్‌మార్కెట్లన్నీ గాలించాలి. ఆవపిండికి ఆర్డరివ్వాలి. ఎర్రటి ఎర్రకారం తెప్పించాలి. కల్తీలేని నువ్వుల నూనె ఎక్కడ దొరుకుతుందో అంజనమేసి గాలించాలి. అంతా అయ్యాక, జాగ్రత్తగా జాడీలకెత్తాలి. అందులోనూ స్పెషలైజేషన్‌. బెల్లమావకాయ, ముక్కావకాయ, పెసరావకాయ, సెనగావకాయ, పులిహోర ఆవకాయ, గుత్తావకాయ, తొణుకావకాయ, నీళ్లావకాయ.ఇవిచాలవన్నట్టు మాగాయ. తియ్యగా వడ్డిద్దామనుకునే తల్లులు తేనె ఆవకాయా పెడతారట!
అరవై అయిదో కళ...ఆవకాయ పెట్టడం. అది ఆంధ్రుల సొత్తు. కాబట్టే, చెన్నై అయ్యరుగారైనా బెంగుళూరు కులకర్ణిగారైనా...పొరుగింటి తెలుగుపిల్ల చిట్టిగిన్నె పట్టుకొచ్చి ‘ఆయ్‌... ఆవకాయ పెట్టామండీ! కాస్త రుచిచూసి పెట్టండి' అనడక్కపోతుందా అని ఎదురుచూస్తుంటారు. అయినా జిహ్వచాపల్యం తీరకపోతే ‘ఆవకాయ పెట్టడమెలా?' అన్న విషయం మీద స్పెషల్‌ క్లాసులు పెట్టించుకుని తమిళంలోనో కన్నడంలోనో నోట్సు రాసుకుంటారు.

HOW TO STAY YOUNG



1. Throw out nonessential numbers. This includes age, weight and height. Let the doctors worry about them. That is why you pay 'them'

2. Keep only cheerful friends. The grouches pull you down..

3. Keep learning. Learn more about the computer, crafts, gardening, whatever. Never let the brain idle. 'An idle mind is the devil's workshop.' And the devil's name is Alzheimer's.

4. Enjoy the simple things.

5. Laugh often, long and loud. Laugh until you gasp for breath.

6. The tears happen. Endure, grieve, and move on. The only person, who is with us our entire life, is ourselves. Be ALIVE while you are alive.

7. Surround yourself with what you love , whether it's family, pets, keepsakes, music, plants, hobbies, whatever. Your home is your refuge.

8. Cherish your health: If it is good, preserve it.. If it is unstable, improve it. If it is beyond what you can improve, get help.

9. Don't take guilt trips. Take a trip to the mall, even to the next county; to a foreign country but NOT to where the guilt is.

10. Tell the people you love that you love them, at every opportunity.

AND ALWAYS REMEMBER :
Life is not measured by the number of breaths we take, but by the moments that take our breath away.



Worry about nothing, pray about everything!!!

"పాప్ కింగ్" మైకేల్ జాక్సన్ మృతి


పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ గుండెపోటుతో మృతి చెందారు. పాప్ సంగీత ప్రపంచాన్ని కొన్నేళ్లపాటు శాసించిన మైకేల్ జాక్సన్ (50) శుక్రవారం వేకువజామున స్థానిక కాలమానం ప్రకారం 2.26 గంటల సమయంలో మృతి చెందారని అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి.

జాక్సన్‌కు గతరాత్రి గుండెపోటు రావడంతో లాస్ ఏంజెలెస్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే ఆయనలో చలనం లేదని లాస్ ఏంజెలెస్ కౌంటీ కార్నర్స్ కార్యాలయ ప్రతినిధి ఫ్రెడ్ కారల్ సీఎన్ఎన్ ఛానల్‌తో చెప్పారు. రాత్రి 12.30 గంటల సమయంలో జాక్సన్‌కు గుండెపోటు వచ్చింది.

ఈ విషయాన్ని లాస్ ఏంజెలెస్ అగ్నిమాపక శాఖ వైద్య సిబ్బందికి సమాచారం అందింది. ఆ సమయంలోనే జాక్సన్ శ్వాస తీసుకోవడం లేదు. అనంతరం ఆయనను వైద్య సిబ్బంది రోనాల్డ్ రీగన్ యూసీఎల్ఏ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన తరువాత వైద్యులు ఆయన మృతి చెందినట్లు ధృవీకరించారు. మైకేల్ జాక్సన్‌కు అంతిమ నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఆస్పత్రి వద్ద, ఆయన నివాసం వద్ద గుమిగూడారు.