కావలసిన పదార్ధాలు :
బియ్యం పిండి పావు కిలో
ఆరు పచ్చిమిర్చి
ఆవాలు తగినంత
జీల్లకర్ర తగినంత
ఉప్పు తగినంత
సన్నగా తరిగిన ఉల్లిపాయ
సన్నగా తరిగిన ఒక టమాట
ఒక కొత్తిమీర కట్ట
రెండు చెంచాల నూనె
ఒక టేబుల్ స్పూన్ పసుపు
తయారుచేసే విదానం :
ముందుగా ఒక బాణలిలో నూనె వేసి తరువాత ఆవాలు, జీల్లకర్ర, ఉల్లిపాయలు, టమాట, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి వేయించాలి. అవి వేగినాక మూడు చిన్న గ్లాసుల నీళ్లు పోసి కొద్దిగా మరగనివ్వాలి. తరువాత ఉప్పు వేసి కలిపి బియ్యంపిండిని వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి (ఇలా చాల సేపు కలుపుతూ ఉండాలి) పిండి ఉడికిన తరువాత పొడి పొడి అయ్యేలాగా వేయించాలి. ఇది చల్లారిన తరువాత పెరుగులో గాని పల్లీల పచ్చడితో గాని నంజుకొని తింటే చాలా బాగుంటుంది.
Showing posts with label ఎంత రుచి రా. Show all posts
Showing posts with label ఎంత రుచి రా. Show all posts
క్యాప్సికమ్ పకోడి
కావలసిన పదార్థాలు :
క్యాప్సికమ్ : రెండు
ఉల్లిపాయలు : రెండు
కొత్తిమీర : చిన్న కట్ట
అల్లం వెల్లులి ఫేస్ట్ : పావు స్పూన్
శనగపిండి : ఒక కప్పు
బియ్యపు పిండి : అర కప్పు
తినే సోడా : పావు స్పూన్
ఉప్పు : రుచికి సరిపడా
కారం : టీ స్పూన్
నూనె : పావు కిలో
తయారు చేయువిధానం : క్యాప్సికమ్, ఉల్లిపాయలు, కొత్తిమీర ను కట్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత శనగపిండి, బియ్యపిండిలో కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ, కొత్తిమీరను జత చేస్తూ, అల్లం, వెల్లుల్లి, సోడాఉప్పు, ఉప్పు, కారం వేసి పకోడి పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి నూనె కాగిన తర్వాత పకోడి వేసి వేయించుకొని తింటే క్యాప్సికమ్ పకోడి చాలా రుచిగా ఉంటుంది.
Labels:
ఎంత రుచి రా
బఠాణీ భాజీ
కావాల్సిన పదార్థాలు:
ఉడికించిన బఠాణీలు : 2 కప్పులు
టొమాటో ముక్కలు : కప్పులు
సిమ్లా మిర్చి : 100 గ్రాములు
ఉల్లి ముద్ద : కప్పు
కొబ్బరి పొడి : 2 టీ స్పూన్స్
వెల్లులి రేకలు : రెండు
కొత్తిమీర : ఒక కట్ట
దనియాల పొడి : అర టీస్పూన్
జీలకర్ర పొడి : అర టీస్పూన్
పసుపు : చిటికెడు
ఉప్పు : రుచికి సరిపడా
తయారు చేయు విధానం : బఠాణీలను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. మరుసటిరోజు నానిన బఠాణీలను కుక్కర్ లో వేసి ఒక్క విజిల్ రానివ్వాలి. దనియాలను, జీలకర్రను దోరగా వేయించుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరను, ఉల్లిపాయలను విడివిడిగ శుభ్రంగా కడిగి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వెల్లులి రేకలు, ఉల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్ర పొడి, సిమ్లామిర్చి వేసి మరో అయిదు నిమిషాలు వేయించిన తర్వాత బఠాణీలను వేసి కలబెట్టాలి. తర్వాత కొత్తిమీర ముద్ద, ఉప్పు, కొబ్బరిపొడి వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి. చివరగా టొమాటో ముక్కలు వేసి ఐదు నిమిషాలు సన్నటి సెగమీద మగ్గనించి దించేసుకోవాలి. ఈ బఠాణీ భాజీ రోటీలోకీ అన్నంలోకీ చాలా బాగుంటుంది.
Labels:
ఎంత రుచి రా
బీరకాయ బజ్జీ
కావలసినవి
బీరకాయలు: రెండు
సెనగపిండి: కప్పు
బియ్యప్పిండి: అరకప్పు
నూనె: 2 కప్పులు
వంటసోడా: చిటికెడు
కారం: 2 టీస్పూన్లు
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
* ముందుగా బీరకాయలు తొక్కు తీసి చక్రాల్లా కోసుకోవాలి.(చేదు లేకుండా చూసుకోవాలి)
* బియ్యప్పిండి, సెనగపిండి, ఉప్పు, కారం, సోడా కలిసి నీళ్లు పోసి జారుగా కలపాలి.
* స్టవ్‌మీద కళాయి పెట్టి నూనె పోసి బాగా కాగిన తరవాత ఒక్కో బీరకాయ ముక్కని సెనగపిండిలో ముంచి నూనెలో వేయించాలి. ఎర్రగా వేయించి తీశాక టొమాటో సాస్‌తో వడ్డించాలి.
Labels:
ఎంత రుచి రా
బైంగన్‌కా బర్తా

కావలసినవి
పచ్చడి వంకాయలు: పెద్దవి రెండు, టొమాటోలు: నాలుగు, ఉల్లిపాయలు: మూడు, కొత్తిమీర: కట్ట, పచ్చిమిరపకాయలు: రెండు, కారం: స్పూను, పసుపు: అరస్పూను, పంచదార: స్పూను, దాల్చినచెక్క: రెండు, లవంగాలు: నాలుగు, ఉప్పు: తగినంత పోపుకోసం: ఆవాలు: ఒక స్పూను, మెంతులు: అర స్పూను, నూనె: ఐదు లేదా ఆరు స్పూన్లు
తయారుచేసే విధానం
వంకాయలకి కొద్దిగా నూనె రాసి చాకుతో గాట్లు పెట్టి స్టవ్ మీద కాల్చి మెత్తగా అయిన తరవాత తీసి పైన చల్లటి నీళ్లు చల్లి పక్కన ఉంచాలి. ఉల్లిపాయలు, టొమాటోలు సన్నగా విడివిడిగా తరగాలి.
బాణలిలో నూనె వేసి లవంగాలు, దాల్చినచెక్క వేయించి తీయాలి. ఆవాలు, మెంతులు వేసి అవి కూడా వేగిన తరవాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరప ముక్కలు వేసి కమ్మని వాసన వచ్చేవరకూ వేయించి అందులో టొమాటో ముక్కలు వేసి ఉప్పు, పసుపు, పంచదార వేసి మూతపెట్టాలి. మెత్తగా అయిన తరవాత దించి పక్కనపెట్టాలి. తరవాత వంకాయలు తొక్క తీసి రోటిలో వేసి మెత్తగా గుజ్జులా చేసి టొమాటోల్లో కలపాలి. లవంగాలు, దాల్చిన చెక్క పొడి చేసి వేయాలి. ఆపైన కొత్తిమీర సన్నగా తరిగి కలిపితే బెంగాలీలు ఎక్కువగా వండే బైంగన్‌కా బర్తా సిద్ధం.
Labels:
ఎంత రుచి రా
కరివేపాకు రైస్

కావలసినవి
కరివేపాకు: నాలుగు టీస్పూన్లు(రుబ్బినది), జీలకర్ర: టీస్పూను, పచ్చిమిర్చి: మూడు, వెల్లులిరేకలు: రెండు, ఉల్లిపాయ: ఒకటిి(ముక్కలుగా కోయాలి), జీడిపప్పు: 9, నిమ్మకాయ: ఒకటి(రసం పిండి ఉంచాలి), బియ్యం: పావుకేజి, నూనె: అరకప్పు, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
అన్నం వండి ఉంచాలి. బాణలిలో నూనె వేసి జీడిపప్పు వేయించి తీయాలి. అదే నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, చిదిమిన వెల్లుల్లి, ఉల్లిముక్కలు, రుబ్బిన కరివేపాకు వేసి బాగా వేయించి దించాలి. ఇందులోనే అన్నం వేసి కలపాలి. ఉప్పు, నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి. చివరగా జీడిపప్పుతో అలంకరిస్తే కరివేపాకు రైస్ రెడీ!
Labels:
ఎంత రుచి రా
బజ్జీ మిర్చి ఫ్రై
కావలసిన పదార్థాలు :
బజ్జీ మిర్చీ - వంద గ్రాములు
శనగపిండి - వంద గ్రాములు
ఉల్లిపాయ -ఒకటి
జీలకర్ర - ఒక టీస్పన్
వామ - ఒక టీస్పన్.
ఉప్పు - తగినంత
కరివేపాకు - నాలుగు రెమ్మలు
కొత్తిమీర -చిన్న కట్ట
నూనె - వేయించడానికి సరిపడా
తయారు చేయువిధానం : ముందుగా బజ్జీ మిర్చి మిరపకాయలను కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. వాటిని మధ్యలోకి చీరి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను, కొత్తిమీర, కరివేపాకులను సన్నగా కట్ చేసుకోవాలి. శనగపిండిని దోరగా వేయించి దానిలో ఉల్లి, కొత్తిమీర, కరివేపాకు తరుగు, నీళ్ళు పోస్తూ గట్టిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మధ్యకి చీరుకున్న బజ్జీ మిర్చి కాయల్లో కూరాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తర్వాత స్టఫ్ చేసిన మిరపకాయలను వేసి బజ్జీల్లాగో దోరగా వేయించుకోవాలి. ఇవి వేడి వేడి పప్పన్నంలోకి, విడిగా తిన్నా చాలా రుచిగా ఉంటాయి.ఇవి వేడి వేడిగా విడిగా తిన్నా, పప్పన్నంలోకి సైడ్ డిష్ గా తిన్నా చాలా రుచిగా ఉంటాయి.
Labels:
ఎంత రుచి రా
క్యాబేజి రైస్
కావలసిన పదార్థాలు :క్యాబేజీ తురుము - 1 కప్పు
బియ్యం - 1 కప్పు
నీళ్ళు - 2 కప్స్
ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
కరివేపాకు - 4 రెమ్మలు
ఆవాలు - అర టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడ
పచ్చిసెనగపప్పు - టీస్పూన్
నువ్వులు - అర టీ స్పూన్
ధనియాలు - అర టీ స్పూన్
కొబ్బరి తురుము - టీ స్పూన్
ఎండు మిర్చి - 4
నూనె తగినంత
తయారు చేయు విధానం : క్యాబేజీని సన్నగా తరిగి పొడి పొడిగా ఉండేలా ఉడికించుకోవాలి. తర్వాత అన్నం కూడా వండి ఆరబెట్టు కోవాలి. బాణలిలో ధనియాలు, పచ్చిసెనగపప్పు, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొబ్బరి తురుము దోరగా వేయించి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మరలా బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మిక్సీ వేసిన పొడిని, ఉడకబెట్టుకున్న క్యాబేజీతో పాటు ఉల్లి ముక్కులు వేసి పది నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత దీన్ని ఆరబెట్టుకున్న అన్నంలో కలిపుకోవాలి. పుదీనా ఆకులతో అలంకరించుని వేడి విడిగా ఆరగిస్తే ఎంతో కమ్మగా ఉంటుంది.
Labels:
ఎంత రుచి రా
నవరతాన్ కుర్మా

కావలసినవి :
కూరగాయలముక్కలు (క్యారెట్, బఠాణీ, బంగాళాదుంప, కాలీఫ్లవర్): 2 కప్పులు, ఉల్లిపాయలు: రెండు, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, పసుపు: అరటీస్పూను, దనియాలపొడి: 2 టీస్పూన్లు, కారం: ఒకటిన్నర టీస్పూన్లు, గరంమసాలా: ఒకటిన్నరటీస్పూన్లు, పాలు: కప్పు, మీగడ: 2 టేబుల్‌స్పూన్లు, నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, పనీర్: 100గ్రా., టొమాటో గుజ్జు: 3 టేబుల్‌స్పూన్లు, డ్రైఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం, కిస్‌మిస్): 4 టేబుల్‌స్పూన్లు, పైనాపిల్‌ముక్కలు: 5 టేబుల్‌స్పూన్లు.
తయారుచేసే విధానం :
ఉల్లిపాయల్ని సన్నగా తురమాలి.
కూరగాయ ముక్కల్ని ఉడికించి ఉంచాలి.
పైనాపిల్ ముక్కల్ని కూడా మెత్తగా చేసి ఉంచాలి.
ఓ నాన్‌స్టిక్ పాన్ తీసుకుని నెయ్యి వేసి చదరపు ముక్కల్లా కోసిన పనీర్‌ను వేసి ఎర్రగా వేయించి పక్కన ఉంచాలి.
అందులోనే ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి తక్కువ మంటమీద వేయించాలి.
తరవాత టొమాటోగుజ్జు, పసుపు, దనియాలపొడి, కారం, గరంమసాలా పొడి, ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. అది ఉడికి మంచి వాసన వస్తుండగా ఉడికించిన కూరగాయ ముక్కలు వేసి దగ్గరగా అయ్యేవరకూ ఉడికించాలి.
ఇప్పుడు పాలు, మీగడ వేసి మరో నిమిషం ఉడికించాలి. చివరగాదించేముందు వేయించిన పనీర్ ముక్కలు, డ్రైఫ్రూట్స్, పైనాపిల్ గుజ్జు, కొత్తిమీర వేసి దించాలి.
Labels:
ఎంత రుచి రా
మొక్కజొన్న గారెల తో విందు..!

తయారీ విధానం :
మొక్కజొన్న కంకులు.. నాలుగు
ఉప్పు.. తగినంత
నూనె.. సరిపడా
పచ్చిమిరప తరుగు.. 1 టీ.
వెల్లుల్లి రేకలు.. 4
తయారీ విధానం :
మొక్కజొన్న కంకుల నుండి గింజలను వేరుచేసి ఉప్పు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడయిన తరువాత నిమ్మకాయంత సైజు పిండిని తీసుకుని అరచేతిమీద వడలా వత్తి నూనెలో వేయాలి. ఎర్రగా కాలిన తరువాత వాటిని తీసివేసి న్యూస్ పేపర్ పైన వేసి నూనె బాగా పీల్చుకున్న తరువాత వేరే పాత్రలో వేసి మూతపెట్టుకోవాలి. వానాకాలంలో వీటిని చేసుకుని తింటే వేడి వేడిగా, భలే రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కూడా..!
Labels:
ఎంత రుచి రా
వెరైటీ వెజ్ ఫ్రైడ్‌రైస్
కావలసిన పదార్థాలు :బీన్స్,క్యారెట్, ఉల్లికాడల తరుగు.. ఒక్కోటి అర కప్పు చొప్పున
బాస్మతి రైస్.. రెండు కప్పులు
వెనిగర్.. నాలుగు టీ.
సోయాసాస్.. 2 టీ.
ఉప్పు.. తగినంత
తయారీ విధానం :
బాస్మతి రైస్‌కు నాలుగు టీస్పూన్ల నూనెను కలిపి.. నాలుగు కప్పుల నీటితో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలి వేడయ్యాక నూనెను పోసి అందులో బీన్స్, క్యారెట్, ఉల్లికాడల తరుగులను చేర్చి, ఉడికించిన రైస్‌ను కలుపుకుని బాగా వేయించాలి. ఇందులో వెనిగర్ సోయాసాస్, ఉప్పు చేర్చాలి. కొద్ది సేపటి తరువాత రైస్ ముద్దలా అవకుండా చూసుకుని దించేయాలి. అంతే వెరైటీ వెజ్ ఫ్రైడ్‌రైస్ రెడీ. దీనికి పెరుగు చట్నీలేదా వెజిటబుల్ కుర్మాను సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.
Labels:
ఎంత రుచి రా
రవ్వ పులిహోర

చింతపండు లేదా నిమ్మతో చేసే అన్నం పులిహోరకు ప్రత్యామ్నాయమిది
కావలసిన పదార్థాలు: బియ్యంరవ్వ- నాలుగుకప్పులు, చింతపండుగుజ్జు- -పావుకప్పు, నూనె-పావుకప్పు, పసుపు-పావుచెంచా.
తాలింపు కోసం: ఆవాలు - చెంచా, వేరుశెనగపప్పు - పావుకప్పు, పచ్చి శెనగపప్పు, మినపప్పు - రెండు చెంచాల చొప్పున, ఎండుమిర్చి - ఐదారు, కరివేపాకురెబ్బలు - నాలుగు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి-ఐదారు.
తయారీ: ముందుగా వెడల్పాటి పాత్ర తీసుకుని ఎనిమిది కప్పుల నీరుపోసి.. రెండుచెంచాల నూనె, పసుపు వేయండి. మరుగుతున్నప్పుడు బియ్యంపిండిని కలిపి సన్ననిమంటపై ఉడకనివ్వాలి. దీన్ని మరో పాత్రలోకి తీసుకుని ఆరనివ్వండి. బాణలిలో నూనె వేసి.. కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండుగుజ్జు తప్ప.. మిగిలిన పదార్థాలన్నీ వేయించండి. ఇందులో చింతపండు గుజ్జు తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు... వేసి.. ఉడకనివ్వండి. ఈ పులుసును నేరుగా బియ్యంరవ్వలో వేసి కలపాలి. అంతే.. రవ్వపులిహోర రెడీ. మరికాస్త రుచికోసం.. చిటికెడు మెంతపొడి, వేయించిన జీడిపప్పు పలుకులు కూడా చేర్చుకోవచ్చు.
Labels:
ఎంత రుచి రా
మఖ్‌మల్‌పూరీ

ఏదో ఒక స్వీట్ కాకుండా... నట్స్‌తో చేసే వెరైటీ పూరీ ఇది.
కావలసిన పదార్థాలు: మైదా, బాదం, జీడిపప్పు, పిస్తా - కప్పు చొప్పున, పంచదార, బొంబాయిరవ్వ - ఒకటిన్నర కప్పు చొప్పున, యాలకుల పొడి- అరచెంచా, నెయ్యి- రెండుచెంచాలు, నూనె-వేయించేందుకు సరిపడా.
తయారీ: మైదాను నీరు ఆ తర్వాత నెయ్యితో పూరీపిండిలా కలిపి నాననివ్వాలి. బాదం, పిస్తా, జీడిపప్పు ఒక నిమిషం మిక్సీలో తిప్పి... ఆ తర్వాత పంచదార కలిపి.. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పొడిచేయాలి. దీనికి యాలకులపొడి, వేయించిన బొంబాయిరవ్వ కలపాలి.
ఇప్పుడు మైదాపిండిని మరోసారి కలిపి.. చిన్నచిన్న ఉండల్లా చేయాలి. చేత్తోనే పూరీలా చేసి.. మధ్యలో ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న మిశ్రమాన్ని చెంచా వేసి.. చుట్టూ మూసేయాలి. పూరీ కాస్త మందంగానే వత్తి నూనెలో వేయించి తీయాలి. అంతే..మఖ్‌మల్‌పూరీ సిద్ధం.
చల్లారాక డబ్బాలో వేస్తే.. పదిరోజుల దాకా నిల్వ ఉంటాయివి.
Labels:
ఎంత రుచి రా
దోసకాయతో నేతి పరాఠాలు
కావలసిన పదార్థాలు :గోధుమపిండి.. 3 కప్పులు
అల్లంవెల్లుల్లి పేస్ట్.. ఒక టీ.
కారం.. రెండు టీ.
దోసకాయ తురుము.. రెండు కప్పులు
పెరుగు.. ఒక టీ.
నెయ్యి.. రెండు టీ.
తయారీ విధానం :
గోధుమపిండిలో కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నెయ్యి, దోసకాయ తురుము, రుచికి కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. దోసకాయల్లో నీరుంటుంది గనక మళ్లీ నీరు పోయకూడదు. పిండిని ముద్దలా చేసుకుని నానబెట్టాలి. తర్వాత పరాఠాల్లా చేసుకుని పెనం పైన రెండువేపులా నెయ్యితో కాల్చి, వేడి వేడిగా పెరుగు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి
Labels:
ఎంత రుచి రా
రోటీలకు సూపర్ సైడ్‌డిష్ "పెసల సబ్జీ"

కావలసిన పదార్థాలు :
పెసర మొలకలు... అర కప్పు
ఉల్లిపాయలు... చిన్నవి రెండు
టొమోటోలు... రెండు
పచ్చిమిర్చి... రెండు
నూనె... మూడు టీ.
మంటినీరు... పావు లీ.
తయారీ విధానం :
పెసల్ని ముందురోజే నానబెట్టుకోవాలి. నీళ్లు వంపేసి బట్టలో కట్టి ఓ రోజు ఉంచితే మొలకలు వస్తాయి. ఉల్లిపాయను ముక్కలుగా కోయాలి. సగం ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి.
తరువాత ఉల్లిముద్ద కూడా వేసి మూడు నిమిషాలు వేయించాక మొలకలొచ్చిన పెసల్ని కూడా వేయాలి. ఇప్పుడు మంచినీళ్లు పోసి మంట తగ్గించి సిమ్‌లో ఉంచి 5-10 నిమిషాలు ఉడికించి దించాలి. కిందికి దించేశాక కొన్ని పచ్చి ఉల్లిముక్కలు, కొత్తిమీరతో అలంకరించి వేడివేడి రోటీలతో పాటు వడ్డించాలి. అంతే రోటీలకోసం పెసర సబ్జీ సిద్ధమైనట్లే...!
పెసర మొలకలు... అర కప్పు
ఉల్లిపాయలు... చిన్నవి రెండు
టొమోటోలు... రెండు
పచ్చిమిర్చి... రెండు
నూనె... మూడు టీ.
మంటినీరు... పావు లీ.
తయారీ విధానం :
పెసల్ని ముందురోజే నానబెట్టుకోవాలి. నీళ్లు వంపేసి బట్టలో కట్టి ఓ రోజు ఉంచితే మొలకలు వస్తాయి. ఉల్లిపాయను ముక్కలుగా కోయాలి. సగం ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి.
తరువాత ఉల్లిముద్ద కూడా వేసి మూడు నిమిషాలు వేయించాక మొలకలొచ్చిన పెసల్ని కూడా వేయాలి. ఇప్పుడు మంచినీళ్లు పోసి మంట తగ్గించి సిమ్‌లో ఉంచి 5-10 నిమిషాలు ఉడికించి దించాలి. కిందికి దించేశాక కొన్ని పచ్చి ఉల్లిముక్కలు, కొత్తిమీరతో అలంకరించి వేడివేడి రోటీలతో పాటు వడ్డించాలి. అంతే రోటీలకోసం పెసర సబ్జీ సిద్ధమైనట్లే...!
Labels:
ఎంత రుచి రా
లెమన్ నూడుల్స్
కావలసిన పదార్థాలు :చైనీస్ రైస్ నూడుల్స్... అర కేజీ
నిమ్మరసం... రెండు టీ.
ఆవాలు... ఒక టీ.
మినప్పప్పు... మూడు టీ.
శెనగపప్పు... మూడు టీ.
పసుపు... అర టీ.
కరివేపాకు... ఒక కట్ట
జీడిపప్పు... గుప్పెడు
పచ్చిమిర్చి... నాలుగు
ఉప్పు... తగినంత
కొబ్బరితురుము... రెండు టీ.
తయారీ విధానం :
నూడుల్స్‌ను మరిగించిన నీళ్లలో వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించి తీసి చిల్లుల మూకుడులో వేసి తడిలేకుండా ఆరనివ్వాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. పప్పులు వేగాక జీడిపప్పు కూడా వేసి ఉప్పు, నిమ్మరసం, కొబ్బరి వేయాలి. తరువాత ముందుగానే ఉడికించి ఆరనిచ్చిన నూడుల్స్ కూడా వేసి కలపాలి. అంతే టేస్టీ టేస్టీ లెమన్ నూడుల్స్ సిద్ధమైనట్లే..!
Labels:
ఎంత రుచి రా
కేరట్ హల్వా

కావలసిన పదార్థాలు :
కేరెట్... పావుకిలో
పంచదార... 200 గ్రా
నెయ్యి... అర్థపావుకిలో
జీడిపప్పు... 10 బద్దలు
కిస్‌మిస్... కావలసినన్ని
ఇలా చెయ్యండి :
ఒక స్టీల్ గిన్నెలో సగం నెయ్యి పోసి జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి వేయించాలి. తరువాత కోరి ఉంచిన కేరెట్ కోరులో పంచదార పోసి సన్నని సెగమీద, నెయ్యివేస్తూ గరిటకు చుట్టుకు వచ్చేదాక ఉడకనివ్వాలి. దించబోయే దాంట్లో ముందు ఏలకులు పొడి చేసి వెయ్యాలి. ఒక పళ్ళానికి నెయ్యిరాసి ఈ కేరెట్ హల్వా పళ్లెంలో వెయ్యాలి. ఆపై అది ఆరిపోకముందే కావాల్సిన ఆకారంలో ముక్కలు కోసుకోవాలి.
కేరెట్... పావుకిలో
పంచదార... 200 గ్రా
నెయ్యి... అర్థపావుకిలో
జీడిపప్పు... 10 బద్దలు
కిస్‌మిస్... కావలసినన్ని
ఇలా చెయ్యండి :
ఒక స్టీల్ గిన్నెలో సగం నెయ్యి పోసి జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి వేయించాలి. తరువాత కోరి ఉంచిన కేరెట్ కోరులో పంచదార పోసి సన్నని సెగమీద, నెయ్యివేస్తూ గరిటకు చుట్టుకు వచ్చేదాక ఉడకనివ్వాలి. దించబోయే దాంట్లో ముందు ఏలకులు పొడి చేసి వెయ్యాలి. ఒక పళ్ళానికి నెయ్యిరాసి ఈ కేరెట్ హల్వా పళ్లెంలో వెయ్యాలి. ఆపై అది ఆరిపోకముందే కావాల్సిన ఆకారంలో ముక్కలు కోసుకోవాలి.
Labels:
ఎంత రుచి రా
వెజ్ స్ప్రింగ్ రోల్స్
కావలసిన పదార్థాలు :మైదాపిండి... అరకేజీ
ఉల్లిపాయలు... 50 గ్రాములు
క్యాబేజీ... 100 గ్రాములు
పచ్చిబఠాణీలు... 50 గ్రాములు
కేరట్... 100 గ్రాములు
బీన్స్... 100 గ్రాములు
అల్లం, వెల్లుల్లి పేస్ట్... ఒకటిన్నర టీస్పూన్
బంగాళాదుంప... రెండు (సన్నగా తరిగినవి)
ఉల్లిపాయలు... రెండు (సన్నగా తరిగినవి)
టమోటోలు... రెండు (సన్నగా తరిగినవి)
కొత్తిమీర... పావు కట్ట (సన్నగా తరిగినది)
కరివేపాకు... 2 ఈనెలు (సన్నగా తరిగినది)
పుదీనా... పావు కట్ట (సన్నగా తరిగినది)
గరంమసాలా పొడి... పావు టీస్పూన్
కారంపొడి... అర టీస్పూన్
ధనియాలపొడి... అర టీస్పూన్
పసుపుపొడి... అర టీస్పూన్
ఉప్పు... తగినంత
నూనె... అరకేజీ
తయారీ విధానం :
మైదాపిండిలో వెన్న వేసి బాగా కలుపుకోవాలి. నీటిలో కాస్తంత ఉప్పు, చక్కెరను కలిపి కరిగిన తరువాత ఆ నీటిని మైదాపిండిలో పోసి బాగా మెత్తగా ముద్ద చేసుకోవాలి. మైదాపిండి ముద్దపై కాస్తంత నూనెను రాసి ఒక తడిగుడ్డను కప్పి ఉంచాలి. కుక్కర్‌లో నూనె వేసి కాగిన తరువాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టును వేసి బాగా వేయించాలి.
తరువాత పైన సన్నగా తరిగి ఉంచుకున్న పదార్థాలు, మిగిలిన పదార్థాలు అన్నింటినీ ఒకటి తర్వాత ఒక్కోటి వేస్తూ బాగా వేయించాలి. చివర్లో వీటికి టమోటో ముక్కలను కూడా కలిపి వేయించాలి. అందులోనే ధనియాలపొడి, మిరపపొడి, పసుపుపొడి, ఉప్పు లాంటివి వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. కావాల్సినంత నీటిని అందులో పోసి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాలను వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి, దించేయాలి.
పై పదార్థాలన్నీ ఉడికేలోపు కలిపి ఉంచుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలాగా వత్తుకోవాలి. స్ర్పింగ్ రోల్స్ కొసలు మూసేందుకుగాను మైదాపిండి నీటిలో చిక్కగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి.
కుక్కర్‌లో ఉడికించిన పదార్థాలను వత్తుకున్న పూరీలలో కొద్ది కొద్దిగా పెట్టి రోల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని పైన కలిపి ఉంచిన చిక్కటి మైదా పిండితో రోల్స్ కొసలను మూసేయాలి.
ఇలా పిండి మొత్తం రోల్స్ లాగా తయారు చేసుకున్న తరువాత వాటిని నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీయాలి. అంతే వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. వీటిని ఏదైనా సాస్‌తో కలిపి వేడి వేడిగా అతిథులకు వడ్డించండి.
Labels:
ఎంత రుచి రా
అల్లం వెల్లుల్లిలతో పుదీనా రైస్
పుదీనా జీర్ణశక్తిని పెంచే ఔషధం మాత్రమే కాకుండా, చక్కటి ఆరోగ్య ప్రదాయిని అన్న సంగతి అందరికీ తెలిసిందే. అల్లం, వెల్లుల్లిపాయలు కూడా జీర్ణశక్తికి మంచిగా తోడ్పడుతాయి. కొంతమందికి పుదీనా వాసన అంటేనే గిట్టదు. వంటలో వేసినప్పటికీ వాటిని తీసి పక్కన పెట్టేస్తుంటారు కూడా. అందుకే అలాంటివారికి పుదీనాను డైరెక్ట్‌గా పచ్చడిలాగా కాకుండా, అన్నంలో కలిపి వెరైటీగా చేసి పెట్టండి... లొట్టలేసుకుంటూ తినేయపోతే ఒట్టు.కావలసిన పదార్థాలు :
బియ్యం... అర కేజీ
పుదీనా... ఎనిమిది కట్టలు
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్... మూడు టీస్పూన్లు
దాల్చిన చెక్క... చిన్నవి రెండు
లవంగాలు... ఆరు
నూనె... ఐదు టీస్పూన్లు
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
ముందుగా అరకేజీ బియ్యాన్ని బాగా కడిగి పొడి, పొడిగా అన్నం వార్చుకుని పక్కన ఉంచుకోవాలి. పుదీనా ఆకులను శుభ్రంగ కడిగి, మిక్సీలో వేసి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి.. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, చెక్క, లవంగాలు, పుదీనా పేస్ట్ వేసి దగ్గరయ్యేదాకా వేయించాలి.
ఇప్పుడు వార్చి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఓ వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని పొడిపొడిగా కలపాలి. తరువాత అందులో పైన తయారు చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. చివర్లో సరిపడా ఉప్పును వేసి, మళ్లీ ఒకసారి కలుపుకోవాలి. అంతే కమ్మటి వాసనతో అదిరిపోయే అల్లం వెల్లుల్లిలతో పుదీనా రైస్ తయారైనట్లే...! దీన్ని ఉల్లిపాయలు, టమోటోలతో కలిపి తయారు చేసిన పెరుగు పచ్చడితో కలిపి తింటే చాలా బాగుంటుంది.
Labels:
ఎంత రుచి రా
మసాలా మహారాణి దాల్

కావలసిన పదార్థాలు :
కందిపప్పు.... పావు కేజీ
అల్లం... చిన్నముక్క
పచ్చికొబ్బరి... కాస్తంత
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... ఆరు
వెల్లుల్లి రెబ్బలు... రెండు
టొమోటోలు... నాలుగు
నూనె... వంద గ్రా.
పసుపు... చిటికెడు
నెయ్యి... రెండు టీ.
జీలకర్ర... ఒక టీ.
ఆవాలు... ఒక టీ.
కరివేపాకు... రెండు రెమ్మలు
నిమ్మకాయ... ఒకటి
కొత్తిమీర... ఒక కట్ట
తయారీ విధానం :
కందిపప్పులో కొద్దిగా పసుపు వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరిని కలిపి ముద్దగా నూరి ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగిన తరువాత, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, టొమోటో ముక్కలను కూడా వేసి వేయించాలి.
ఇప్పుడు విడిగా ఉడికించి ఉంచిన పప్పను ఇందులో వేసి కలపాలి. కాసేపటి తరువాత మసాలా ముద్దను కూడా వేసి బాగా కలిపి, ఉప్పు సరిజూడాలి. విడిగా మరో బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో తాలింపు చేసి ఉడుకున్న పప్పులో కలపాలి. చివర్లో నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే ఘుమఘుమలాడే మసాలా మహారాణి దాల్ రెడీ...!!
కందిపప్పు.... పావు కేజీ
అల్లం... చిన్నముక్క
పచ్చికొబ్బరి... కాస్తంత
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... ఆరు
వెల్లుల్లి రెబ్బలు... రెండు
టొమోటోలు... నాలుగు
నూనె... వంద గ్రా.
పసుపు... చిటికెడు
నెయ్యి... రెండు టీ.
జీలకర్ర... ఒక టీ.
ఆవాలు... ఒక టీ.
కరివేపాకు... రెండు రెమ్మలు
నిమ్మకాయ... ఒకటి
కొత్తిమీర... ఒక కట్ట
తయారీ విధానం :
కందిపప్పులో కొద్దిగా పసుపు వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరిని కలిపి ముద్దగా నూరి ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగిన తరువాత, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, టొమోటో ముక్కలను కూడా వేసి వేయించాలి.
ఇప్పుడు విడిగా ఉడికించి ఉంచిన పప్పను ఇందులో వేసి కలపాలి. కాసేపటి తరువాత మసాలా ముద్దను కూడా వేసి బాగా కలిపి, ఉప్పు సరిజూడాలి. విడిగా మరో బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో తాలింపు చేసి ఉడుకున్న పప్పులో కలపాలి. చివర్లో నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే ఘుమఘుమలాడే మసాలా మహారాణి దాల్ రెడీ...!!
Labels:
ఎంత రుచి రా
Subscribe to:
Posts (Atom)

