నిన్ను తలవకుండా నిమిషమైన ఉండాలని అనుకుంటా..........
కాని నువ్వు వదిలి వెళ్ళిన మనసు నాకన్నా నిన్నే ఎక్కువగా తలుస్తుంది.
నీ పేరు నైనా మరచి పోదామని పెదవిని మౌనంతో బంధిస్తే ........
నువ్వు వెలి వేసిన హృదయం, నీ పేరుని గుండె చప్పుడుగా మరచుకుంది.
నీ రూపమైన మరచి పోవాలని కను రెప్పలను అడ్డుపెడితే......
కను పాప కమ్మని స్వప్నం లో నిన్ను దాచుకుంది.
నీ జ్ఞాపకల నైన మరచి పోవాలని కన్నీటిని విడిస్తే........
కన్నీరు హృదయ పుటం లో కవితల అల్లుకుంది.
నిన్ను తలవకుండా నిమిషమైన ఉండలేనని తెలిసి.....
నాకు నేనే దూరామగుతున్న............!